TG: కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్న వాళ్లందరినీ తొక్కుకుంటూ వెళ్లి సీఎం పదవి రేవంత్రెడ్డి తెచ్చుకున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచి సీఎం పదవిలోకి వచ్చానని చెబితే అందరూ హర్షిస్తారే తప్ప ఈ తొక్కుకుంటూ వస్తామనడం ఏమిటో ఆయనే చెప్పాలన్నారు. సీఎం వాడుతున్న భాషను చూసి జనం అసహ్యించుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు.