ADB: ఇంద్రవెల్లి మండలం ఆందునాయక్ తండాలోని శ్రీజ్వాలాముఖి దుర్గాభవాని అలయంలో ఈనెల 24న ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి రామ్ సింగ్ మహారాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆయుష్షు, ఆరోగ్యం, సంక్షేమం కోసం నిర్వహించే మహా కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలిపారు.