TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమె కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై కేంద్ర ఎన్నికల సంఘం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. కాగా తన పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోందంటూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.