TG: హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి శ్రీపరాభవ నామ సంవత్సరం నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. పంచాంగకర్త బాచంపల్లి సంతోష్‌కుమార్‌ను సీఎం సన్మానించారు. అనంతరం సంతోష్‌కుమార్ పంచాంగ ప్రవచనం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించనున్నారు.