ఈ ఏడాది అనుష్క శెట్టి పెళ్లంటూ వస్తున్న రూమర్స్‌ను ఆమె టీమ్ కొట్టిపారేసింది. SM వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని ప్రకటించింది. సమాచారం లేకుండా ఎలాంటి వార్తలను పబ్లిష్ చేయొద్దని మీడియాను కోరింది. అనుష్క ఏజ్‌కు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం ఆమె ప్రైవసీకి భంగం కలిగించడమేనని పేర్కొంది. వ్యక్తిగత విషయమైన పెళ్లిపై ఇలా రూమర్స్ సృష్టించడం సరికాదని తెలిపింది.