AP: తిరుమల తిరుపతి దేవస్థానముల(TTD) ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన యోగేష్ కొంతకాలంగా సోషల్ మీడియాలో TTDపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. TTD విజిలెన్స్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా చేశాడా? లేక అతని వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.