ATP: అనంతపురం నగరంలోని జయప్రకాష్ నారాయణ పాఠశాలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి, నాణ్యతపై విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం సరిగా లేదని ఫిర్యాదులు వస్తే ఏజెన్సీలను మారుస్తామని హెచ్చరించారు.