KDP: ఎర్ర చందనం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మైదుకూరు, రాజంపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో వేరు వేరుగా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. SP మాట్లాడుతూ.. సోషల్ మీడియా వల్ల మహిళలు, బాలికలకు కలిగే వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు.