AP: తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. జోరువానలో పేద ముస్లిం సోదరుడు షేక్ అమీర్ ఇంటిని ఆయన సందర్శించారు. అమీర్ ఇంట్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అమీర్ కుటుంబసభ్యులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. అమీర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు.