KDP: జిల్లాలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. నూర్జహాన్ ఉర్దూ ఘర్, షాదీ ఖానాలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి తదితరులు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల బకాయిల విడుదలపై ముస్లిం సోదరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.