TG: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. రేపు ఉగాది సందర్భంగా సభకు సెలవు ప్రకటించారు.