మైక్రో బ్లాగింగ్ వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లు టైమ్‌లైన్ రీఫ్రెష్ కావడం లేదని, పోస్టులు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్లలో ఈ సమస్య తలెత్తింది. దాదాపు గంట తర్వాత సేవలు పునరుద్ధరించబడినట్లు తాజా సమాచారం.