W.G: పేదలకు ఇళ్ల స్థలాల హామీ నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 24న తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు తెలిపారు. బుధవారం తణుకులో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.