E.G: ఉగాది పర్వదిన సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో AMC ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ దంపతులు ఉన్నారు.