MNCL: మంచిర్యాలకు చెందిన బోనగిరి శ్రీహర్షవర్ధన్ జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరు సుధాకర్ తెలిపారు. మార్చి 21 నుంచి 25 వరకు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీహర్షవర్ధన్ పాల్గొంటారని పేర్కొన్నారు. శ్రీహర్షవర్ధన్ను పలువురు అభినందించారు.