జీవితంలో పైకి రావాలని, అభివృద్ధి చెందాలని కోరుకునే ఏ వ్యక్తయినా సరే ఈ ఆరు లక్షణాలను వెంటనే వదిలేయాలని విదురుడు బోధించాడు. అవి: అతినిద్ర, మగత(ఎప్పుడూ మత్తుగా ఉండటం), భయం, క్రోధం(కోపం), సోమరితనం, దీర్ఘసూత్రత(పనులను రేపటికి వాయిదా వేయడం). ఈ 6 గుణాలు మనిషి ప్రగతికి అతిపెద్ద శత్రువులు. వీటిని పూర్తిగా విడిచిపెట్టిన వాడే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడని విదుర నీతి సారాంశం.