AP: అతివేగం కారణంగా అన్నమయ్య జిల్లాలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులైన సురేంద్ర, మాధవ, మహేష్ రాత్రి మదనపల్లె చౌడేశ్వరి దేవి ఉత్సవాలకు వెళ్లివస్తుండగా.. కురబలకోట మండలం సర్కారుతోపు సమీపంలో బైక్ నియంత్రణ కోల్పోయి వేగంగా డివైడర్ను ఢీకొట్టారు. తీవ్ర గాయాలతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.