TG: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సీతారామచంద్ర స్వామిని తిరువీధుల గుండా ఊరేగించనున్నారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై స్వామివారు ఊరేగింపుగా వస్తుంటే, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య భద్రాద్రి పురవీధులు పులకించనున్నాయి. భక్తులు తమ ఇంటి ముంగిటే స్వామివాని దర్శించుకునే భాగ్యం కలగనుంది.