ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్ధాపురం గ్రామంలో శుక్రవారం జరగనున్న శ్రీ కొల్లాపూరమ్మ స్వామి ఆరో ఉగాది బోనాల జాతరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు పెద్దశివయ్య, సుబ్బయ్య, కటేశ్వరయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.