TG: రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు.