SRCL: విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదవాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. ఇవాళ తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల& కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, సిబ్బంది హాజరు రిజిస్టర్, కిచెన్, స్టోర్ రూం పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్లో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు.