NRPT: ఊట్కూరు మండల పరిధిలో శుక్రవారం మొరం అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఏర్గాట్పల్లి గ్రామ శివారులోని గుట్టల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా మొరం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు ఈడిగ మహేందర్, శివకుమార్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.