AP: 20 లక్షల ఉద్యోగాల దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. కోవూరు ఘగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నెల్లూరులో MSME క్లస్టర్ పూర్తవుతుందని.. వందలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పారు. ఎన్నికల హామీలకంటే రెట్టింపు స్థాయిలో నెల్లూరును అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.