MLG: జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌తో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయం కోసం భూమి కేటాయించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. జిల్లాలో కార్యాలయం లేక కార్యకలాపాలకు ఇబ్బంది అవుతున్నదని, రెండు ఎకరాల భూమి కేటాయించాలని వినతిపత్రంలో కోరారు.