TPT: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కార్మికుల రిలే నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరాయి. సమస్యలపై యాజమాన్యం స్పందించకపోవడంతో ఆందోళన ఉధృతమవుతోంది. సీఐటీయూ నాయకులు వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీరే వరకు దీక్షలు కొనసాగుతాయని కార్మికులు స్పష్టం చేశారు.