KKD: పిఠాపురంలో CI శ్రీనివాస్ “No Drugs Bro” కార్యక్రమం నిర్వహించారు. యువతకు డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలు గురించి వివరించారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా, రవాణా వంటి చర్యలు చట్టపరంగా తీవ్రమైన నేరాలని, కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు నాశనం అని హెచ్చరించారు.