SRCL: జనాభా గణన కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను ఉపాధ్యాయుల సీనియార్టీ ఆధారంగా నియమించాలని PRTUTS రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్ కోరారు. ఈ మేరకు చందుర్తి మండల తహసీల్దార్‌కు, PRTUTS అధ్యక్షుడు పుప్పాల శ్రీనివాసచారి నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.