KMM: వైరా రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు జరిపారు. సోదాల సమయంలో సిబ్బందిని బయటకు వెళ్లకుండా లోపలి నుంచి తలుపులు వేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నగదు నిల్వలు, దస్త్రాల నిర్వహణపై అధికారులు ఆరా తీస్తున్నారు. కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.