కోనసీమ: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన కారణంగా ముమ్మిడివరంలో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం బుక్ చేసినా గ్యాస్ అందడం లేదని, గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని అంటున్నారు. గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నామన్నారు.