TG: ‘ఆరు గ్యారంటీల’ అమలుకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీల కోసమే రూ.50,713 కోట్లు కేటాయించింది. అయితే, గత ఏడాది ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్లో రూ.56,084 కోట్లు కేటాయించగా, ఈసారి మాత్రం రూ.50,713 కోట్లు మాత్రమే నిధులు కేటాయించింది. దీంతో ఈ ఏడాది ఆరు గ్యారంటీల అమలుకు రూ.5,371 కోట్ల మేర నిధులు తగ్గాయి.