HYD: నగరంలో జీవన శైలి వేగంగా మారుతున్న నేపథ్యంలో స్లీపింగ్ టైం రోజురోజుకు తగ్గిపోతోందని ఉప్పల్‌కు చెందిన డా.సుహాసిని పేర్కొన్నారు. ఉద్యోగ ఒత్తిడి, ట్రాఫిక్, మొబైల్ వినియోగం, రాత్రి జీవనం పెరగడం వంటి కారణాలు నిద్రలేమికి దారితీస్తున్నాయని తెలిపారు. సరిపడ నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన జీవనానికి 7-8 గంటలు నిద్రించాలన్నారు.