GNTR: జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ ‘మిషన్ వాత్సల్య’ కింద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కౌన్సిలర్, మేనేజర్, స్టోర్ కీపర్, హెల్పర్, పీటీ/యోగా టీచర్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు మార్చి 23 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు guntur.ap.gov.inలో చూడాలి.