AP: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని సామాజిక ఆస్పత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వార్డులు, మందుల నిల్వ గదిని తనిఖీ చేసిన ఆయన.. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని వైద్యులకు ఆయన సూచించారు. అటు నూతన భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు.