ADB: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జాదవ్ నరేష్ గురువారం నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ ప్రణీతను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గమనిస్తూ ప్రణీతను నియమించినట్లు వెల్లడించారు. దీంతో పలువురు ఆమెను అభినందించారు.