AP: ప్రజలకు మేలు జరిగే పనులకే అధిక ప్రాధాన్యతనిస్తూ పని చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులోని బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం వంటివి ఎంత చేసినా కుటుంబాల్లో మార్పు విద్య వల్ల మాత్రమే వస్తుందని చెప్పుకొచ్చారు.