TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. మండలిలో మంత్రి ఉత్తమ్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.