తిరుపతి మెడికల్ కాలేజీ-రుయా హాస్పిటల్ రోడ్డులో ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి అతను మదనపల్లె, పొన్నిపాల్యం, కుమరపురం, నమాజ్ కట్ట ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించారు.