SRD: షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులకు వివిధ పథకాల లబ్ధి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MPDO శారద తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోలార్ పంపు, విద్యుత్ ద్విచక్ర వాహనాల అవసరానికి గాను 2025-26 ప్రకారం బ్యాంకు ద్వారా రుణ సహాయం పొందవచ్చన్నారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈనెల 24 వరకు ఆన్లైన్లో https://tgobmms.cgg.gov.in దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.