NRML: కడెం మండలంలోని కొత్త మైసంపేట్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి కొత్త మైసంపేట్కు చెందిన మాడావి దేవ్ రావు మృతి చెందాడు. పశువుల కాపరిగా పనిచేస్తున్న దేవరావు గత రెండు రోజుల క్రితం పశువులు మేపడం కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన కనిపించకపోగా శుక్రవారం వ్యవసాయ బావిలో శివమై కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.