TG: బడ్జెట్లో విద్యాశాఖకు ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించిందని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ.. అభూత కల్పనలానే ఉందన్నారు. విద్యాశాఖకు కేవలం 8 శాతం నిధులు కేటాయించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు.. టీచర్ల నియామకాలు లేవని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల ప్రస్తావన లేదని ధ్వజమెత్తారు.