ఏలూరు జిల్లాలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులోని అన్నే భవనంలో అకాల వర్షాల పంట నష్టాలపై ఆయన మాట్లాడారు. నిన్న, మొన్న కురిసిన అకాల వర్షాలకు, ఈదురు గాలులకు జిల్లాలో అనేక తోటలు నేలకొరిగాయి చెప్పుకొచ్చారు.