ATP: కళ్యాణదుర్గంలోని శ్రీ అక్కమాంబ జాతర సందర్భంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఆధునిక డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక బలగాలను మోహరించారు. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ అందుబాటులో ఉన్నాయి.