WGL: ఖానాపురం(M)లోని కొత్తూరు గ్రామంలో జై భీమ్ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్సై రఘుపతి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.