HYD: రంజాన్ పర్వదినం సందర్భంగా పాతబస్తీలో నెల రోజులుగా సాగుతున్న నైట్ బజార్ రేపటితో ముగియనుంది. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలు రాత్రివేళల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రేపు పండుగ కావడంతో ఈ ప్రత్యేక షాపింగ్‌కు తెరపడనుంది. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో సాయంత్రం నుంచే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.