TG: రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో పాము ప్రత్యక్షమవ్వడం ఒక్కసారిగా కలకలం రేపింది. మీడియా పాయింట్ వద్ద పాము కనిపించడంతో అక్కడున్న ప్రతినిధులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎంతో ధైర్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ పామును పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బడ్జెట్ సమావేశం వేళ ఈ ఘటన జరగడం గమనార్హం.