చర్మ సంరక్షణకు కొందరు స్టిరాయిడ్స్ వాడుతుంటారు. అయితే బెటామెథసోన్ వంటి స్టిరాయిడ్ క్రీములను ముఖానికి రాయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి చర్మాన్ని వ్యసనంలా లొంగదీసుకుని, వాడకం ఆపగానే తీవ్రమైన మంట, దురద కలిగిస్తాయట. ఇంకా చర్మం పలుచబడటం, ఇన్ఫెక్షన్లు, మొటిమలు వంటి సమస్యలూ వస్తాయని చెబుతున్నారు. ఇలాంటివి వాడే ముందు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.