VZM: ఈ నెల 24న ఉదయం 8 గంటలకు విజ్జి స్టేడియంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. 35 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గలవారు SAAP వెబ్సైట్లో ఆధార్‌తో రిజిస్టర్ కావాలన్నారు.