AP: జాబ్ క్యాలెండర్‌ను జోక్ క్యాలెండర్‌గా మంత్రి లోకేష్ మార్చారంటూ MLA తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తూతూమంత్రంగా 10 వేల ఉద్యోగాలు ప్రకటించి చేతులు దులుపుకున్నారని తెలిపారు. నిరుద్యోగ భృతి రెండేళ్లుగా ఇవ్వలేదని పేర్కొన్నారు. లోకేష్ చదువుకున్న వ్యక్తి కాదని.. చదువుకొన్న వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించటం తప్ప లోకేష్ ఏం చేయలేదన్నారు.