TG: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ఛైర్మన్ పీఠం తమదేనని MLA వెడ్మ బొజ్జు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఐదుగురు సభ్యుల బలం ఉందని.. మరో రెండు ఓట్లు కూడా తమకే పడతాయని వెల్లడించారు. నిన్న జరిగిన ఉద్రిక్తతలకు అధికారులదే బాధ్యత అని పేర్కొన్నారు. కాగా ఖానాపూర్ ఛైర్మన్ పీఠం విషయంలో పార్టీల మధ్య గొడవలు జరగడంతో ఎన్నిక ఈరోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.