నటి నిమిషా నాయర్‌కు ముంబైలో నడిరోడ్డుపై చేదు అనుభవం ఎదురైంది. తెల్లవారుజామున క్యాబ్‌లో వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు బైక్‌తో కారును అడ్డుకున్నారు. ఆమెను, డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధించారు. ఈ భయానక దృశ్యాలను నిమిషా వీడియో తీసి SM వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.